కాంగ్రెస్ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోంది : బండి సంజయ్

BJPTelangana: కర్నాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. రేపు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే… పాకిస్తాన్ వెళ్లి ప్రచారం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్ధి మునిరాజుతో కలిసి ప్రచార రథంపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా జనం. కార్యకర్తలు తరలివచ్చి జై బీజేపీ… జైజై బండి సంజయ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగించారు.  వచ్చే నెల 10న జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ బాక్స్ బద్దలయ్యేలా పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించండని బండి అభ్యర్ధించారు. ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించండన్నారు. బాగేపల్లి బీజేపీ అభ్యర్ధి మునిరాజు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మళ్లీ విజయోత్సవ సభకు సీటీ రవితో కలిసి ఇక్కడికే వస్తానని బండి స్పష్టం చేశారు.

 

You May Have Missed

Optimized by Optimole