1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదవ రోజు(19.15కోట్లు).. అమిర్ ఖాన్ దంగల్(రూ.18.59 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి.. బాహుబలి_2 (19.75)చేరువలో ఉంది. టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకూ రూ.116.45 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిక్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.