kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని పురాణాల్లో తెలుపబడింది. ఈ మాసంలో పిల్లల పుట్టుక బాధపడుతున్న వారు..జాతకపరంగా దోషాలు ఉన్నావారు ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని భక్తుల విశ్వాసం.

పురాణ కథ….

శివుడు ఓసారి తీవ్ర తపస్సులో లీనమై ఉన్నాడు. అప్పుడు మన్మథుడు ప్రేమబాణంతో శివుడి తపస్సును భంగపరిచాడు. ఆ కోపంలో శివుడు తన మూడో కంటిని తెరిచి, ఒక్క చూపుతో మన్మథుడిని భస్మం చేశాడు. అదే సమయంలో శివుని శరీరంచి వెలువడిన ఉగ్ర తేజస్సు అగ్నిదేవుడు సైతం భరించలేని స్థితికి చేరింది. అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజస్సును గంగా నదిలోని రెల్లుపొదల మధ్య విడిచాడు. ఆ తేజస్సే పరాక్రమశాలి కుమారస్వామిగా అవతరించాడు. ఆ రోజు ఆషాఢమాసంలోని షష్టి తిథి కావడంతో కుమారస్వామి జన్మదినంగా పరిగణిస్తారు. అందుకే ‘కుమారషష్టి’ రోజున స్వామివారిని విశేషంగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక కుమార స్వామి ఆరు ముఖాలతో అవతరించినందున ‘షణ్ముఖుడు’ అని పిలుస్తారు. ఆయనకు షష్టి తిథి అంటే అపారమైన ప్రీతీ. ఆషాఢమాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ముందురోజైన స్కందపంచమి రోజున ఉపవాసదీక్ష పాటించి, మరుసటి రోజు స్వామివారిని పూజిస్తే, సత్ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

పవిత్రమైన ఈ రెండు రోజులు వల్లీదేవసేన సమేతంగా ఉన్న స్వామివారి దర్శనానికి ఆలయాలకు వెళ్లి మొక్కితే, సంతానసంపత్తి కలుగుతుందని నమ్మకం. అంతేకాక, స్వామికి అభిషేకాలు చేయించి, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణం చేస్తే స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదం ఉంచి పాలు సమర్పిస్తే, నాగదోషం, కుజదోషం వంటి జాతకబాధల నుంచి విముక్తి లభిస్తుంది.

Optimized by Optimole