దేశంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు..
ఎప్పటిలాగే బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తూన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే హైదరాబాద్‌లో బంగారం ధర వంద రూపాయలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గమనిస్తే, దేశంలో 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలను చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 120 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 49 వేల 220 రూపాయలుగా ఉంది. అదే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం 44 వేల 850 రూపాయలుగా ఉంటే, 24 క్యారెట్ గోల్డ్ 48 వేల 930 రూపాయలుగా ఉంది. ఇక, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కనిపిస్తున్నాయి.