కేజ్రీవాల్ కి హైకోర్ట్ 25,000 జరిమానా.. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..!

పార్థ సారథి పొట్లూరి: 2016 లో కేజ్రీవాల్ భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ విద్యార్హతల వివరాలు కోరుతూ రైట్ to ఇన్ఫర్మేషన్ చట్టం[Right to Information (RTI) కింద కోరాడు. కేజ్రీవాల్ అభ్యర్ధనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ [Central Information Commission] కేజ్రీవాల్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని, యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీ లని కోరింది !

ఇలా ప్రధాని విద్యార్హత వివరాలు [గ్రాడ్యుయేషన్  పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన వివరాలు ]అడగడా న్ని యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ హై కోర్ట్ ఆఫ్ గుజరాత్ లో పిటిషన్ వేసింది.  కేజ్రీవాల్ ప్రధాని కి సంబంధించిన వివరాలని గోప్యంగా ఉంచాల్సింది పోయి ఇలా బహిరంగపరచడాన్ని ఆక్షేపించింది. మోడీజీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో 1978 లో గుజరాత్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా తీసుకున్నట్లుగాను,  1983 లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నట్లుగా డిక్లేర్ చేశారు. గత నెలలో గుజరాత్ హై కోర్టులో పిటిషన్ విచారణకి వచ్చిన సందర్భంలో సోలిసిట్ జెనెరల్  తుషార్ మెహతా  వాదిస్తూ గుజరాత్ యూనివర్శిటీ ప్రధానికి సంబంధించిన ఎలాంటి వివరాలని ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజాస్వామ్యం లో ఏదన్నా ఆఫీసులో అధికారంలో ఉన్న మంత్రి, ఇతరులు కానీ ఎలాంటి విద్యార్హతలు కలిగి ఉండాలన్న నిబంధన ఏదీ లేదని వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారని..విద్యార్హతకి వారు నిర్వహించే పదవులకి సంబంధం లేదని వాదించారు తుషార్ మెహతా !

ప్రధాని విద్యార్హతల గురుంచి పిటిషనర్ అడగడానికి అర్హతలేదన్నారు. ప్రధాని ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అన్నది అడగడానికి వీలులేదని.. అదే ఆహారం కోసం ఎంత ఖర్చుపెడుతున్నారని ఆడగవచ్చని కాబట్టి ఎవరో పిల్ల చేష్టల మనఃస్తత్వం కలిగిన వ్యక్తి … బాధ్యతలేని వ్యక్తి అడిగిన సమాచారాన్ని కోర్టు వారు పట్టించుకొనవసరం లేదని వాదించారు తుషార్ మెహతా !

ప్రధాని పదవిని నిర్వహించడానికి ఎలాంటి విద్యార్హత ఉండాలో రాజ్యాంగంలో ఎక్కడా నిర్దేశించలేదు!

RTI అనేది పబ్లిక్ యాక్టివిటీ కి సంబంధించినది మాత్రమే వ్యక్తిగత వివరాల ఇందులోకి రావు! 2016 లో మోడీజీ విద్యార్హతల గురుంచి ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ నగరంలో పోస్టర్లు అతికించారు !

కేజ్రీవాల్ తరుపున వాదించిన అడ్వొకేట్  పెర్సీ కవిన [Percy Kavina] వాదిస్తూ నా క్లయింట్ కేవలం ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ గురించి అడిగారు కానీ మార్క్స్ లిస్ట్ గురుంచి కాదు అన్నారు. మరి ఢిల్లీ నగరంలో ప్రధాని విద్యార్హతల గురుంచి పోస్టర్లు అతికించడాన్ని కోర్టు ప్రశ్నించినపుడు అది ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు సహజమే అని జవాబు చెప్పారు. వాదోపవాదనలు అనంతరం  గుజరాత్ హై కోర్ట్ విలువయిన కోర్టు సమయాన్ని వృధా చేశారు అంటూ కేజ్రీవాల్ కి 25,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది ! 

ఒక్క ఢిల్లీ లోనె కాదు ఆమ్ ఆద్మీ పోటీ చేసిన ప్రతి నగరాలలో కూడా ప్రధాని విద్యార్హతల ని ప్రశ్నిస్తూ AAP కార్యకర్తలు పోస్టర్లు అంటించడాన్ని హై కోర్ట్ తీవ్రంగా పరిగిణిచింది. ప్రధాని పదవి నిర్వహించడానికి ఆయన విద్యార్హతలని ఆడగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

కానీ ఆప్ నేతలు మాత్రం.. మళ్ళీ భారత దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ! దీని మీద అమెరికాతో పాటు యూరోపు దేశాలు కూడా తమ అభిప్రాయాలని వెల్లడిస్తూ భారత్ లో ప్రజాస్వామ్యం ని బ్రతికించడానికి మేము భారత దేశ అంతర్గత విషయాలలో కలుగచేసుకుంటాము అని చెప్తాయి మళ్ళీ మళ్ళీ ! ఎందుకంటే ఈ దేశాలకి రాహుల్,కేజ్రీవాల్ లాంటి వాళ్ళు.. జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్స్ సొసైటీ లాంటి NGO ల అవసరం ఎంతయినా ఉంది !

జైహింద్!జై భారత్ !

Optimized by Optimole