ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆకస్మిక బదిలీపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.. మొన్న సుబ్రమణ్యం …నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్ నెక్స్ట్ ఎవరో..? అన్న చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎన్నికలకు ఏడాది గడువు ఉండటం.. ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచడం.. ఇంటా బయటా జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెరగడం చూస్తుంటే.. సీఐడీ చీఫ్ ల బదిలీల వెనక బలమైన కారణం ఉండవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయం.
కాగా సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.1995లో పులివెందుల ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించి.. ఎన్నో కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ ను .. జగన్ సర్కార్ కొత్త సంవత్సరం జనవరి 1 న డీజీ ర్యాంకుతో ప్రమోట్ చేసింది. రాజధాని భూములు.. సోషల్ మీడియా పోస్టులు.. టీడీసీ నేతలకు సంబంధింన అనేక కేసుల్లో కీలకంగా వ్యహరించారు. అలాంటింది ఆకస్మికంగా ఆయనను జీఏడీకి బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.నచ్చితే అందలం.. నచ్చకపోతే పాతాళం స్ట్రాటజీని సునీల్ కుమార్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి అప్లైచేశాడని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక సునీల్ పేరు బాగా వినిపించింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు..నమ్మకస్తుడు మెలుగుతూ వచ్చారు. అలాంటింది.. ఉన్నట్టుండి ఆయనను జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీచేయడం ఉన్నాతిధికారులను విస్మయపరిచింది. అయితే ఇది సాధారణంగా జరిగిందా?లేక కొత్త వ్యక్తిని సునీల్ స్థానంలో తీసుకురాబోతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది !