————————– ———- ———-//
పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు.
EWS కోటాను 10 శాతం నుంచి 50 శాతానికి పెంచేసి రద్దయిన జనరల్ లేదా ఓపెన్ కేటగిరీ స్థానంలో పెట్టాలి. అప్పుడు అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలవారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న-రిజర్వేషన్లలో ఆర్ధిక ప్రాతిపదిక -అమల్లోకి వచ్చినట్టవుతుంది. మిగిలిన 50 శాతంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండేలా జాగ్రత్త పడితే పవిత్ర భారతంలో ‘సామాజిక న్యాయం’ పరిఢవిల్లుతుంది. దేశంలో కులం కుంగి, కృశించి, నశించిపోతుంది. బాపూ, బాబాసాహబ్ కల నిజమవుతుంది.