×

 

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి.

ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే పూజల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి పూజల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు…. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణం శుద్ది అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు.

తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు.

వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది.

మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం. ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి.

ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణపరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది…

Author

dhoni.raju219@gmail.com

Related Posts

ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో...

Read out all

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం...

Read out all

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని...

Read out all

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం....

Read out all

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం...

Read out all

Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు....

Read out all
Optimized by Optimole