Nancharaiah merugumala (senior journalist):
గర్భ విచ్ఛిత్తికి బదులు ‘కడుపు తీయించుకోవడం’ అనే మాట వాడకూడదా?
–––––––––––––––––––––––––––––––––––––––––––
గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావానికి బదులు తెలుగునాట జన సామాన్యం వాడుక మాట– కడుపు తీయించుకోవడం– పత్రికల్లో, టీవీ చానళ్లలో వాడకూడదా? మమూలు మనుషులు పలికే ‘కడుపు తీయించుకోవడం’ అనే మాటలు అబార్షన్ లేదా గర్భస్రావం మాదిరిగానే పెళ్లయినవారికి, అవివాహితులకు కూడా వర్తించేలా వాడుకుంటున్నారు. సిజేరియన్ సెక్షన్ (సీఎస్) ఆపరేషన్ కు కత్తెర కాన్పు అని పెద్ద తెలుగు పత్రిక ఒకటి వాడుతోంది.
అలాంటప్పుడు–కడుపు తీయించుకోవడం–అనే పద ప్రయోగంలో ఎవరినీ కించపరిచే ధ్వని లేదనుకుంటున్నాను. కడుపు చేయడం అనే మాటలో ఉన్న చెడు భావం కడుపు తీయించుకోవడంలో ఉందా? నాకైతే లేదనిపిస్తోంది. ఈ విషయంపై తెలుగు యాస, భాష తెలిసిన తెలుగు వయోధిక పాత్రికేయ ఉద్దండులు తెలుగువారికి కొంత చెబితే బాగుంటుంది. నేను పాతికేళ్ల వయసు వచ్చేదాకా మా అమ్మ సంపూర్ణం, ఆమె చెల్లెళ్లు, ఇతర బంధువుల నోట విన్న–ఫలానా సుబ్బమ్మ కూతురు నీళ్లోసుకుంది, మావుళ్లమ్మ మనవరాలు నెల తప్పింది, మద్దిరావమ్మ కోడలకి కడుపొచ్చింది–వంటి ప్రయోగాలు ఇప్పుడు ఎక్కడా వినపడడం లేదు. నేను పుట్టిన పునాదిపాడు, పెరిగిన గుడివాడ పట్టణంలో కూడా ఇలాంటి మాటలు మరిచిపోతున్నారు.
నిన్న దివంగత ‘రెబల్ స్టార్’ ఉప్పలపాటి కృష్ణంరాజు గారి ఊరు మొగల్తూరులో కూడా కోనసీమ జిల్లా ద్రాక్షారామం నుంచి వచ్చిన వంట మేస్త్రీలు, కార్మికులు కొన్ని వంటకాల పేర్లను ఇంగ్లిష్ లో పలకడం బాగుంది. ఏం వంటలు చేస్తున్నారు మీరు? అని ఓ తెలుగు న్యూజ్ చానల్ విలేఖరి అడిగితే, ‘ ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫ్రాన్స్ రోస్టు, చికెన్ రోస్టు, చికెన్ ఫ్రై,’ అని ఇంగ్లిష్ భాషలోనే జవాబిచ్చారు ద్రాక్షారామం వంట నిపుణులు.
ద్రాక్షారామం అనగానే మా కృష్ణా జిల్లా వంట నిపుణుల ఊరు ఇందుపల్లి గుర్తొచ్చింది
–––––––––––––––––––––––––––––––––––––––––––––
కృష్ణంరాజు స్మారకదినం సందర్భంగా లక్ష మందికి ఏర్పాటు చేసిన విందు భోజనాల కోసం మొగల్తూరుకు వంట చేయడానికి వచ్చిన బృందాన్ని, ‘మీరు ఎక్కడ నుంచి వచ్చారు?’ అని ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టరు అడిగినప్పుడు వారు తమది పాత తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం అని చెప్పారు. పశ్చిమ గోదావరి మా పక్క జిల్లాయే అయినా ఎంతసేపూ నేను కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల విశేషాలే తెలుసుకోవడం ఒక వయసులో నాకు బలహీనత. నా చిన్నప్పటి గొప్ప నగరం మద్రాసుకు పోయే దారిలో ఉన్న ఈ జిల్లాలు (అప్పటికి ప్రకాశం అనే కృత్రిమ జిల్లా పుట్టలేదు) నిజంగా నాకు చాలా ఘనమైనవిగా కనిపించేవి. ఇప్పటికీ ఈ అభిప్రాయం పెద్దగా మారలేదు.
తెలుగు జర్నలిజంలో చేరాక మాత్రమే గోదావరి జిల్లాల లోతుపాతులు ఓ మోస్తరుగా తెలిశాయి. ఒకప్పుడు, ఇప్పుడు కూడా పెళ్లిళ్లు, పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే ఫంక్షన్లకు వంటలు చేయాలంటే గుడివాడ–బెజవాడ రైల్వేలైను మధ్యలో ఉన్న ఇందుపల్లి గ్రామానికి చెందిన క్యాటరింగ్ నిపుణులు వస్తారు. హైదరాబాద్ మహానగరంలోనూ ఈ ఇందుపల్లికి మాంచి బ్రాండ్ వాల్యూ ఉంది. (గత పాతికేళ్లుగా ఈ ప్రాంత కమ్మ కులానికి చెందిన శ్రామికులు కూడా ఇందుపల్లి పేరు వాడుకుంటూ క్యాటరింగ్ వృత్తిలో స్థిరపడ్డారు) ఈ ఒరిజినల్ పాకశాస్త్ర నిపుణులంతా రజక లేదా చాకలి కులానికి చెందినవారు. వాస్తవానికి మొదట నాటు కోడిని కోయడం రజకులకు మాత్రమే కృష్ణా జిల్లా గ్రామాల్లో తెలుసు. కమ్మ, కాపు రైతులు మా ప్రాంతంలో తమ ఇళ్లలోని నాటుకోళ్లు కోయడానికి రజకులను పిలుపించుకునేవారు. ఇప్పుడెలా ఈ పనిచేసుకుంటున్నారో తెలియదు. అయినా, అన్ని కులాల జనం చికెన్ సెంటర్లు నడుపుకుంటున్న ఈ రోజుల్లో నాటుకోడి కోయడానికి రజకుల అవసరం లేకపోచ్చనే అనుకోవచ్చు.
మళ్లీ ఇందుపల్లి విషయానికి వస్తే ఈ గ్రామానికి చెందిన రజక ప్రముఖుడు, పాక నిపుణుడు వడ్డాణపు కోటేశ్వరరావు గారు నందమూరి తారకరామారావు గారింట్లో ఏ పెళ్లి, పండగ జరిగినా తన తన ఇందుపల్లి బృందంతో వచ్చి హైదరాబాద్‌లో వంటచేసి వెళ్లేవాడు. నా పాత్రికేయ మిత్రుడు, మా మా పెద్ద పిన్ని నాగనబోయిన విజయలక్ష్మి గారి ఊరు వేంపాడుకు చెందిన మల్లంపల్లి సాంబశివరావు గతంలో కొన్ని పత్రికల్లో రాసిన ఈ సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది. అయితే, నిన్న మొగల్తూరు రాజుల ఇంట లక్ష మందికి వంటచేసిన ద్రాక్షారామం కామ్రేడ్లు ఏ కులానికి చెందినవారో నాకింకా సమాచారం అందలేదు. అయితే, వారు రజకులు కాకపోవచ్చని నాకు వారిలో ఒకరి మాటలను బట్టి అర్ధమైంది. గోదావరి రాజులు ఈమధ్య తమకు మాత్రమే ఇష్టమైనదిగా చెప్పుకుంటున్న ‘దూకుడు బిరియానీ’ ఎలా వండుతారో చెప్పాలని ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధి అడిగాడు. దానికి ‘ఏముందండీ, మామూలు బిరియానీలానే మేక మాంసంతో వండుతాం,’ అని ద్రాక్షారామం వంట మేస్త్రీ ఒకరు చెప్పాడు. అంతేగాని ఈ రాజుల ఫేవరైట్ బిరియానీ గుట్టు విప్పలేదు. ఈ మాటలను బట్టి చూస్తే, ఈ వంట బృందం రాజకులు కాదనిపించింది. అసలు నిజం ఏమిటో తర్వాత తెలుస్తుంది.
అనేక ఆంగ్ల పదాలకు తెలుగు పదాలను– పండిత్యం నేర్చుకున్న మంచి బ్రాహ్మణులతో సృష్టింపచేస్తున్న ఈనాడు యాజమాన్యం ఈ ప్రక్రియకు కొంత విరామం ప్రకటించాలి. పైన చెప్పిన ద్రాక్షారామం వంట నిపుణులు వంటి శ్రామిక వర్గాలకు, ‘‘ చేప ఇగురు, చేప వేపుడు, కోడి ఇగురు, కోడి పులుసు, రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు,’’ వంటి తెలుగు పదాలు లేదా కూరల తెలుగు పేర్లు నేర్పితే తెలుగు సమాజానికి ఎనలేని సేవ చేసినట్టువుతుంది. తెలుగుపెద్ద (తమిళ పెరియార్ అనుకోండి, కొంపలేమీ కూలిపోవు) చెరుకూరి రామోజీరావు గారు ప్రగాఢ సంకల్పంతో అందుకోసం ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ప్రత్యేక తెలుగు శిబిరాలు పెట్టి సాధారణ ప్రజానీకానికి వారు మరిచిపోతున్న తెలుగు పేర్లు, మాటలు నేర్పిస్తే చాలా బాగుంటుంది. జిత్తులమారి రాజమండ్రి నియోగ బ్రాహ్మణ నేత, ‘రాజకీయ విశ్లేషకుడు’ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు ఉనికిలో లేని మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై ఎన్ని చిందులు తొక్కినా రామోజీరావు గారు తన తెలుగు భాషా సేవతో నిశ్చింతగా నూట పాతికేళ్లు బతికేయవచ్చు.గర్భ విచ్ఛిత్తికి బదులు ‘కడుపు తీయించుకోవడం’ అనే మాట వాడకూడదా?
‘ఈనాడు’ కొత్త తెలుగు మాటలు కనిపెట్టే కంటే పాత తెలుగు పేర్లు నేర్పిస్తే మేలు!
–––––––––––––––––––––––––––––––––––––––––––
గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావానికి బదులు తెలుగునాట జన సామాన్యం వాడుక మాట– కడుపు తీయించుకోవడం– పత్రికల్లో, టీవీ చానళ్లలో వాడకూడదా? మమూలు మనుషులు పలికే ‘కడుపు తీయించుకోవడం’ అనే మాటలు అబార్షన్ లేదా గర్భస్రావం మాదిరిగానే పెళ్లయినవారికి, అవివాహితులకు కూడా వర్తించేలా వాడుకుంటున్నారు. సిజేరియన్ సెక్షన్ (సీఎస్) ఆపరేషన్ కు కత్తెర కాన్పు అని పెద్ద తెలుగు పత్రిక ఒకటి వాడుతోంది. అలాంటప్పుడు–కడుపు తీయించుకోవడం–అనే పద ప్రయోగంలో ఎవరినీ కించపరిచే ధ్వని లేదనుకుంటున్నాను. కడుపు చేయడం అనే మాటలో ఉన్న చెడు భావం కడుపు తీయించుకోవడంలో ఉందా? నాకైతే లేదనిపిస్తోంది. ఈ విషయంపై తెలుగు యాస, భాష తెలిసిన తెలుగు వయోధిక పాత్రికేయ ఉద్దండులు తెలుగువారికి కొంత చెబితే బాగుంటుంది. నేను పాతికేళ్ల వయసు వచ్చేదాకా మా అమ్మ సంపూర్ణం, ఆమె చెల్లెళ్లు, ఇతర బంధువుల నోట విన్న–ఫలానా సుబ్బమ్మ కూతురు నీళ్లోసుకుంది, మావుళ్లమ్మ మనవరాలు నెల తప్పింది, మద్దిరావమ్మ కోడలకి కడుపొచ్చింది–వంటి ప్రయోగాలు ఇప్పుడు ఎక్కడా వినపడడం లేదు. నేను పుట్టిన పునాదిపాడు, పెరిగిన గుడివాడ పట్టణంలో కూడా ఇలాంటి మాటలు మరిచిపోతున్నారు. నిన్న దివంగత ‘రెబల్ స్టార్’ ఉప్పలపాటి కృష్ణంరాజు గారి ఊరు మొగల్తూరులో కూడా కోనసీమ జిల్లా ద్రాక్షారామం నుంచి వచ్చిన వంట మేస్త్రీలు, కార్మికులు కొన్ని వంటకాల పేర్లను ఇంగ్లిష్ లో పలకడం బాగుంది. ఏం వంటలు చేస్తున్నారు మీరు? అని ఓ తెలుగు న్యూజ్ చానల్ విలేఖరి అడిగితే, ‘ ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫ్రాన్స్ రోస్టు, చికెన్ రోస్టు, చికెన్ ఫ్రై,’ అని ఇంగ్లిష్ భాషలోనే జవాబిచ్చారు ద్రాక్షారామం వంట నిపుణులు.
ద్రాక్షారామం అనగానే మా కృష్ణా జిల్లా వంట నిపుణుల ఊరు ఇందుపల్లి గుర్తొచ్చింది
–––––––––––––––––––––––––––––––––––––––––––––
కృష్ణంరాజు స్మారకదినం సందర్భంగా లక్ష మందికి ఏర్పాటు చేసిన విందు భోజనాల కోసం మొగల్తూరుకు వంట చేయడానికి వచ్చిన బృందాన్ని, ‘మీరు ఎక్కడ నుంచి వచ్చారు?’ అని ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టరు అడిగినప్పుడు వారు తమది పాత తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం అని చెప్పారు. పశ్చిమ గోదావరి మా పక్క జిల్లాయే అయినా ఎంతసేపూ నేను కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల విశేషాలే తెలుసుకోవడం ఒక వయసులో నాకు బలహీనత. నా చిన్నప్పటి గొప్ప నగరం మద్రాసుకు పోయే దారిలో ఉన్న ఈ జిల్లాలు (అప్పటికి ప్రకాశం అనే కృత్రిమ జిల్లా పుట్టలేదు) నిజంగా నాకు చాలా ఘనమైనవిగా కనిపించేవి. ఇప్పటికీ ఈ అభిప్రాయం పెద్దగా మారలేదు. తెలుగు జర్నలిజంలో చేరాక మాత్రమే గోదావరి జిల్లాల లోతుపాతులు ఓ మోస్తరుగా తెలిశాయి. ఒకప్పుడు, ఇప్పుడు కూడా పెళ్లిళ్లు, పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే ఫంక్షన్లకు వంటలు చేయాలంటే గుడివాడ–బెజవాడ రైల్వేలైను మధ్యలో ఉన్న ఇందుపల్లి గ్రామానికి చెందిన క్యాటరింగ్ నిపుణులు వస్తారు.
హైదరాబాద్ మహానగరంలోనూ ఈ ఇందుపల్లికి మాంచి బ్రాండ్ వాల్యూ ఉంది. (గత పాతికేళ్లుగా ఈ ప్రాంత కమ్మ కులానికి చెందిన శ్రామికులు కూడా ఇందుపల్లి పేరు వాడుకుంటూ క్యాటరింగ్ వృత్తిలో స్థిరపడ్డారు) ఈ ఒరిజినల్ పాకశాస్త్ర నిపుణులంతా రజక లేదా చాకలి కులానికి చెందినవారు. వాస్తవానికి మొదట నాటు కోడిని కోయడం రజకులకు మాత్రమే కృష్ణా జిల్లా గ్రామాల్లో తెలుసు. కమ్మ, కాపు రైతులు మా ప్రాంతంలో తమ ఇళ్లలోని నాటుకోళ్లు కోయడానికి రజకులను పిలుపించుకునేవారు. ఇప్పుడెలా ఈ పనిచేసుకుంటున్నారో తెలియదు. అయినా, అన్ని కులాల జనం చికెన్ సెంటర్లు నడుపుకుంటున్న ఈ రోజుల్లో నాటుకోడి కోయడానికి రజకుల అవసరం లేకపోచ్చనే అనుకోవచ్చు. మళ్లీ ఇందుపల్లి విషయానికి వస్తే ఈ గ్రామానికి చెందిన రజక ప్రముఖుడు, పాక నిపుణుడు వడ్డాణపు కోటేశ్వరరావు గారు నందమూరి తారకరామారావు గారింట్లో ఏ పెళ్లి, పండగ జరిగినా తన తన ఇందుపల్లి బృందంతో వచ్చి హైదరాబాద్‌లో వంటచేసి వెళ్లేవాడు. నా పాత్రికేయ మిత్రుడు, మా మా పెద్ద పిన్ని నాగనబోయిన విజయలక్ష్మి గారి ఊరు వేంపాడుకు చెందిన మల్లంపల్లి సాంబశివరావు గతంలో కొన్ని పత్రికల్లో రాసిన ఈ సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది.
అయితే, నిన్న మొగల్తూరు రాజుల ఇంట లక్ష మందికి వంటచేసిన ద్రాక్షారామం కామ్రేడ్లు ఏ కులానికి చెందినవారో నాకింకా సమాచారం అందలేదు. అయితే, వారు రజకులు కాకపోవచ్చని నాకు వారిలో ఒకరి మాటలను బట్టి అర్ధమైంది. గోదావరి రాజులు ఈమధ్య తమకు మాత్రమే ఇష్టమైనదిగా చెప్పుకుంటున్న ‘దూకుడు బిరియానీ’ ఎలా వండుతారో చెప్పాలని ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధి అడిగాడు. దానికి ‘ఏముందండీ, మామూలు బిరియానీలానే మేక మాంసంతో వండుతాం,’ అని ద్రాక్షారామం వంట మేస్త్రీ ఒకరు చెప్పాడు. అంతేగాని ఈ రాజుల ఫేవరైట్ బిరియానీ గుట్టు విప్పలేదు. ఈ మాటలను బట్టి చూస్తే, ఈ వంట బృందం రాజకులు కాదనిపించింది. అసలు నిజం ఏమిటో తర్వాత తెలుస్తుంది. అనేక ఆంగ్ల పదాలకు తెలుగు పదాలను– పండిత్యం నేర్చుకున్న మంచి బ్రాహ్మణులతో సృష్టింపచేస్తున్న ఈనాడు యాజమాన్యం ఈ ప్రక్రియకు కొంత విరామం ప్రకటించాలి. పైన చెప్పిన ద్రాక్షారామం వంట నిపుణులు వంటి శ్రామిక వర్గాలకు, ‘‘ చేప ఇగురు, చేప వేపుడు, కోడి ఇగురు, కోడి పులుసు, రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు,’’ వంటి తెలుగు పదాలు లేదా కూరల తెలుగు పేర్లు నేర్పితే తెలుగు సమాజానికి ఎనలేని సేవ చేసినట్టువుతుంది. తెలుగుపెద్ద (తమిళ పెరియార్ అనుకోండి, కొంపలేమీ కూలిపోవు) చెరుకూరి రామోజీరావు గారు ప్రగాఢ సంకల్పంతో అందుకోసం ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ప్రత్యేక తెలుగు శిబిరాలు పెట్టి సాధారణ ప్రజానీకానికి వారు మరిచిపోతున్న తెలుగు పేర్లు, మాటలు నేర్పిస్తే చాలా బాగుంటుంది.
జిత్తులమారి రాజమండ్రి నియోగ బ్రాహ్మణ నేత, ‘రాజకీయ విశ్లేషకుడు’ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు ఉనికిలో లేని మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై ఎన్ని చిందులు తొక్కినా రామోజీరావు గారు తన తెలుగు భాషా సేవతో నిశ్చింతగా నూట పాతికేళ్లు బతికేయవచ్చు.