పన్ను వసూలు పేరుతో అధికారులు బెదిరిస్తున్నారు: మనోహర్

ఏపీ లో ఖాళీ స్థలాల పేరు చెప్పి సామాన్యులను  పన్ను వసూలు పేరుతో మున్సిపాలిటీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. ఖాళీ స్థలాల్లో బోర్డులుపెట్టి హెచ్చరించడాన్ని కచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలుగా భావిస్తున్నామన్నారు.ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడే ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారిగా, కబ్జాకోరుగా మారడానికి వైసీపీ నాయకత్వమే కారణమని మనోహర్ మండిపడ్డారు.

కాగా  సీఎం జగన్  ఆలోచనకు అనుగుణంగానే మున్సిపల్  అధికారులు నడుచుకొంటున్నారేమోని?..ఇంటి పన్ను కట్టకపోతే ఇళ్ళల్లో సామాన్లు జప్తు చేసి చెత్త వాహనాల్లో తరలిస్తున్నారని మనోహర్ దుయ్యబట్టారు. ఇప్పుడు తమకు ఓ ఆస్తిగా ఉంటుందని సామాన్యులు కొనుక్కొన్న చిన్నపాటి జాగాలను కూడా స్వాధీనం చేసుకోవడం వెనక కుట్ర ఉందన్నారు. మున్సిపాలిటీ కబ్జా చేసిన స్థలాలను తాకట్టుపెట్టే ఆలోచన ఉందా?అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివసిస్తున్న ప్యాలెస్ కి పన్ను కట్టలేదనే విషయం పత్రికలు బయటపెట్టే వరకూ అధికారులు కిమ్మనలేదని ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజలంటే అధికారులకు అలుసా? అధికార పక్షం చెప్పిందని.. ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు స్వాధీనం చేసుకొంటాము.. భవనాలు కట్టుకొంటాము అంటే అధికారులు ఇబ్బందుల పాలవుతారని మనోహర్ హెచ్చరించారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole