జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ కౌలు రైతు భరోసా ‘ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని.. అన్ని గ్రామాల ప్రజలకు తెలిపే విధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల కొణిదెల నాగబాబు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా చేసుకున్న 3 వేల రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు. ఇంతలా రైతాంగం కోసం పరితపిస్తున్న జనసేన విధానాలను రైతులకు తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక..వ్యవసాయాన్ని లాభాసాటిగా చేసే విధానాలను తెలపడం.. రైతుల సంక్షేమ కోసం జనసేన పనిచేస్తుందన్న భరోసా రైతులకు కల్పించేలా కృషిచేయాలని పార్టీ శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు.