కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కొత్త కార్య వర్గాన్ని ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించింది. వీటితో పాటు 40 మంది జాబితాతో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ప్రకటించింది. 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను.. 24 మంది వైస్ ప్రెసిడెంట్లనూ.. 84 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
వెంకట్ రెడ్డికి మొండి ‘ చెయ్యి ‘..
కాగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన ఏ కమిటీలోనూ మాజీ మంత్రి సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి స్థానం దక్కలేదు.దీంతో హైకమాండ్ వెంకట్ రెడ్డిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు షాకింగ్ గా మాజీ మహిళ మంత్రి గీతారెడ్డిని సైతం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది ఏఐసీసీ. వయసు రీత్యా ఆమెను ఎంపిక చేయనట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు.
జాక్ పాట్ కొట్టిన ‘ రఘువీరారెడ్డి ‘..
ధారూర్ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. రేవంత్ అనుచరుడిగా పేరున్న ఆయనకు…మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అండ ఉండడం..నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఈ సారి జిల్లా అధ్యక్ష పదవి రఘువీరా రెడ్డిని వరిస్తుందని పార్టీలో జోరుగా చర్చ జరిగింది.కానీ పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై నమ్మకముంచిన అధిష్టానం మరోసారి అతనికే జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
టీపీసీసీ కమిటీలు..
►పొలిటికల్ అఫైర్స్ కమిటీ -18మంది
►వర్కింగ్ ప్రెసిడెంట్స్ – 04
►జిల్లా అధ్యక్షులు – 26 మంది
►వైస్ ప్రెసిడెంట్స్- 24 మంది
►జనరల్ సెక్రటరీ- 8 మంది
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ నియమించిన కాంగ్రెస్ అధిష్టానం..
1.మాణికం ఠాగూర్ ( చైర్మన్)
2. రేవంత్ రెడ్డి
3. మల్లు భట్టి విక్రమార్క
4. వి.హనుమంత రావు
5. పొన్నాల లక్ష్మయ్య
6. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. కె. జానా రెడ్డి
8. టి. జీవన్ రెడ్డి
9. డా.జె. గీతారెడ్డి
10. మహమ్మద్ అలీ షబ్బీర్
11. దామోదర్ సి రాజా నరసింహ
12. రేణుకా చౌదరి
13. పి. బలరాం నాయక్
14. మధు యాష్కీ గౌడ్
15. చిన్నా రెడ్డి
16. శ్రీధర్ బాబు
17. వంశీ చంద్ రెడ్డి
18. సంపత్ కుమార్
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు రాజకీయ వ్యవహారాల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు..
1. ఎండీ అజారుద్దీన్
2. అంజన్ కుమార్ యాదవ్
3. జగ్గా రెడ్డి
4. మహేష్ కుమార్ గౌడ్