తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.దాదాపు గంటన్నర పాటు సచివాలయ ప్రాంగణమంతా తిరిగిన సీఎం.. పలువురు ఉన్నాతాధికారులు, ఇంజనీర్లను కలిసి పనుల పురోగతిపై ఆరాతీశారు.సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నాతాధికారులు ఉన్నారు.

ఇక దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్థుల మేర సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్న విషయం అందరీకి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ 9 వ సారి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే 95 శాతం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఇంటరీయర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో సంక్రాతి తర్వాత సచివాలయం ప్రారంభ తేది ఖరారు చేసే అవకావం ఉన్నట్లు కనిపిస్తోంది.

కాగా పనులను పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్.. ఫార్ములా ఈ1 రేస్ వరకు   పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అనుకున్న సమయానికి సచివాలయం పూర్తి కావాలని అధికారులతో సీఎం తేల్చిచెప్పారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole