కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు సూర్యాపేట నియోజక వర్గం లో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు అక్షరాల 85 కోట్ల రూపాయలని తెలిపారు. అభివృద్ధి పనుల విలువ 7000 కోట్ల రూపాయలు దాటిందన్న మంత్రి..జిల్లా వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి కోసం 300 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇక 2014 కు ముందు తో పిలిస్తే తెలంగాణలో ప్రతి గ్రామంలో.. కరెంట్, త్రాగునీరు కొదవలేదన్నారు. నియోజక వర్గంలోని గ్రామాలకు వెళ్ళినప్పుడు చెరువు లు అలుగు పోస్తున్న దృశ్యాలు కనిపించాయని అన్నారు. తెలంగాణా ప్రగతిని చూసి.. కర్ణాటక , మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు.. కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజన సమయం లో శాపనార్థాలు పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సైతం..కేసిఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

Optimized by Optimole