స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: రఘురామ

స్మార్ట్ మీటర్ల కోసం జగన్ ప్రభుత్వం.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. స్మార్ట్ మీటర్ల సరఫరా పేరుతో  తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దండుకుంట ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదన్నారు. గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడులో మూడువేల రూపాయలకే  స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని..రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36 వేల రూపాయలు గా నిర్ణయించడం పట్ల  ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.స్మార్ట్ మీటర్ల    పారదర్శకంగా జరగాలంటే.. ప్రముఖులైన  జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు.

కాగా పాతిక లక్షల స్మార్ట్ మీటర్ల ధర ఒక్కొక్కటి 36 వేల రూపాయలుగా నిర్ణయించి.. పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని కొట్టేయడానికి వైసీపీ నేతలు  ప్రణాళికలు రచించారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. కాంట్రాక్టును వైసీపీ పార్టీ తరపున   డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన  షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యాజమానికి  కట్టబెట్టాలని చూశారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానని సదరు వ్యక్తి రెండున్నర లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని అడిగారని ఆయన గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్ల డీల్ సెట్ అయిందనుకునే లోపు.. మీడియాకు  నిజాలు తెలియడంతో  మీటర్ల బాగోతం  పురిట్లోనే సమాధి అయ్యిందని రఘురామ రాజు దుయ్యబట్టారు.

 ఇదిలా ఉంటే..స్మార్ట్ మీటర్ల ధర 300% పెంచడం పై ఓ  ఐఏఎస్ అధికారి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిసిందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.2025 నాటికల్లా  స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని  కేంద్రం గడువును నిర్దేశించిందన్నారు. పొరుగు రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు  ఎలా చేస్తున్నారో.. రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని సూచించారు.200 నుంచి 500 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారు.. జీరో నుంచి 200 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులకు కోటిన్నర స్మార్ట్ మీటర్లు అవసరమవుతాయని రఘురామ తేల్చి చెప్పారు.

 

 

 

 

 

You May Have Missed

Optimized by Optimole