×

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల రద్దుపై తన దృష్టికి వచ్చిన  నోటీసు కారణాలను పవన్ లేవనెత్తారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు..  ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని సాకుగా చూపి నోటీసులిచ్చారని మండి పడ్డారు. అదే నిజమైతే  వృద్ధులకు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు జనసేనాని  పేర్కొన్నారు.

ఇక పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్ళు ఉన్నాయని నోటీసులో చూపారని పవన్ ఆరోపించారు. నిజంగా అన్ని ఇళ్ళు ఆమెకు ఉంటే.. ఎక్కడ ఉన్నాయో చూపించి ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ది దారులు ఆస్తి పరులైతే పింఛన్లు కోసం కార్యాలయాల చుట్టూనో.. వాలంటీర్ల చుట్టూనో ఎందుకు తిరుగుతారని? పవన్ ప్రశ్నించారు.

విద్యుత్ బిల్లు పెరిగిందనో.. ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో పింఛన్లు రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు పవన్. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటున్నాయని… అలాగే ఒకే ఇంటి నెంబర్ తో మూడు నాలుగు వాటాలు ఉంటాయన్నారు. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులను.. వితంతువులను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేనాని విజ్ఞప్తి చేశారు. పాతికేళ్ళ కిందట చనిపోయినవారు.. ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారని నోటీసుల్లో చూపించి.. వితంతు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారని బెదిరించడం సరికాదని హితువు పలికారు. పదిపదిహేనేళ్ళకు ముందు నుంచీ పింఛన్ తీసుకొంటున్న దివ్యాంగులను.. నాడు ఇచ్చిన ధ్రువపత్రాలు ఇప్పుడు చూపించాలని ఒత్తిడి చేయడం వెనక దాగున్న ఉద్దేశం ఏంటో తెలపాలని పవన్ డిమాండ్ చేశారు.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు...

Read out all

cinima: ఆడవాళ్ల ఎత్తు..లోతు తెలిసినవాడు..భారతీరాజా

విశీ (వి.సాయివంశీ) : పొన్నాత్త..ఎట్లాంటి మనిషి? గయ్యాలి గంప కదా! అంత బారు చీర, చెవులు జారే గెంటీలు, ఇంతెత్తున కొప్పు. ఊరిపెద్ద భార్య అన్న మాటే కానీ..ఆ మనిషితత్వం...

Read out all

National: బీజేపీకి అన్నామలై గుడ్‌బై…!

Chennai: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా బీజేపీకి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన...

Read out all

Newdelhi: భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో...

Read out all

Chennai: సీఎం విజయ్‌ కి షాక్? బీజేపీలో చేరనున్న సంగీత..?

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ మాజీ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

Read out all

Telangana: ఎన్టీఆర్ విగ్రహం..రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌?

Ntrstatue: By Rajashekhar ✍🏽/ senior journalist రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక సంకేతాలను పంపిస్తాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు...

Read out all
Optimized by Optimole