IncTelangana: కేటీఆర్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారు: పటేల్ రమేష్ రెడ్డి
హైదరాబాద్: కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ పై వీధి రౌడీల మాదిరిగా కేటీఆర్ మాట్లాడుతున్నాడని.. హద్దులు దాటి మాట్లాడితే నాలుక కోసే స్థాయిలో ప్రజలు ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు ఊడి ఇంటికి పంపించినా, కేటీఆర్‌కి సిగ్గురాలేదని…