ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం తథ్యం: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. 12నుంచి 14  శాతం కంటే ఎక్కువ మెజారిటీతో.. ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందన్నారు. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాలు  టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన.. ఇటీవల తాను ప్రాంతాల వారిగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేటతెల్లమయిందన్నారు. ఉత్తరాంధ్ర లో పది నుంచి 12 శాతం టిడిపికి ఎడ్జ్ ఉండగా.. ఉభయగోదావరి జిల్లాలలో 14 నుంచి 16 శాతం, కృష్ణా..గుంటూరు జిల్లాలలో 12 నుంచి 14 శాతం, ఒంగోలు నెల్లూరులలో  ఎనిమిది నుంచి పది శాతం, అనంతపురం, కర్నూలులలో  10 నుంచి 12 శాతం, కడప చిత్తూరులలో  6 నుంచి 8 శాతం టిడిపికి ఎడ్జ్ ఉందని  తెలిపారు.  టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను మొదటి నుంచి చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.

కలలో కూడా అవకాశమే లేదు..

ఇక వై నాట్ 175 అని వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ..కలలో కూడా ఆ అవకాశమే లేదని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.  టిడిపికి అనూహ్య ఆదరణ లభించడం ఆశ్చర్యకర పరిణామన్నారు.  రానున్న ఎన్నికల్లో వైసీపీ మ్యాజిక్ ఫిగర్ ఎలా సాధిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే..తమ పార్టీకి దారుణమైన పరాభవం తప్పదని రఘురామ జోస్యం చెప్పారు.

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole