మెగాస్టార్ ,చిరంజీవి నటిస్తున్న మళయాళ రిమేక్ లూసిఫర్. తాజాగా చిత్రయూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. చిరు లుక్ చూసిన అభిమానుల ఆనందాల హద్దేలేకుండా పోయింది. మాస్ లుక్ లో బాస్ అదరగొట్టాడంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.
నో క్లాస్ – నో మాస్ 🥳
ఓన్లీ కూల్ 😎వన్ అండ్ ఓన్లీ తలా 🤩@msdhoni 😉#StarSportsTelugu #MSDhoni #CelebratingMSD #Maahi #Chiranjeevi pic.twitter.com/tr4Y0dx78V
— StarSportsTelugu (@StarSportsTel) July 4, 2022
courtesy:starsports
మరోవైపు క్రికెట్ అభిమానులు ప్రేమతో తల అని పిలుచుకునే ధోనిని..తెలుగు స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లూసిఫర్ ఫస్ట్ లుక్ లో ఎడిట్ చేస్తూ .. నో క్లాస్ నో మాస్..వన్ అండ్ ఓన్లీ తల అంటూ క్యాప్షన్ తో షేర్ చేసింది. దీంతో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు ధోని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రికెట్ లో తల తర్వాతే ఎవరైనా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. వన్ అండ్ ఓన్లీ మిస్టర్ కూల్ అంటూ మరో నెటిజన్ క్యాప్షన్ జతచేశాడు.