మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రధాన వేదిక, డీ జోన్, వీర మహిళలు, మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించిన అనంతరం.. సభకు హాజరయ్యే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని నాయకులకి సూచించారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు.
జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణం వద్ద పెడన, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు జనసేనలో చేరారు. అందరికీ కండువా కప్పి మనోహర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తిరువూరు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు పసుపులేటి సురేష్, లింగినేని సుధాకర్, మైనారిటీ నాయకులు షేక్ ఫరీద్, కొలగాని అఖిల్, రామిశెట్టి జగన్, కస్తూరి ఓంకార్, గొడ్డేటి కరిముల్లా, పెడన నియోజకవర్గం చిట్టి గూడూరు మాజీ సర్పంచ్ వేము ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు.