పదులు కాదు… వందలు కాదు… ఏకంగా వేలాది యువ గళాలు గొంతు విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్ నాదెండ్ల మనోహర్. యువగళాలు మండే నిప్పు కణికల్లాంటి ప్రశ్నలను సంధించేందుకు యువశక్తి వేదిక కాబోతుందన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే మహోత్తర కార్యక్రమంలో మాట్లాడేందుకు.. 100 మంది యువతకు అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి యువతరం నుంచి.. వేలాది వాయిస్ రికార్డులు, మెయిల్స్ వచ్చాయన్నారు. వచ్చిన వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పార్టీ సిబ్బంది ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుందన్నారు.
ఇక జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 6 వేల 458 ఫోన్ కాల్స్, 1235 ఈ – మెయిల్స్ అందాయన్నారు మనోహర్. యువత వేదనను, వారి మనోభావాలను జనసేన పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని మనోహర్ స్పష్టం చేశారు.