భారత దేశం ఆధ్యాత్మిక నిలయానికి పెట్టింది పేరు.. సమస్యలు, ఆందోళనలు, చుట్టిముట్టినప్పుడు ప్రశాంతత కోసం విహారాయాత్రల పేరిట ఆలయాలను సందర్శిస్తాం.. అందులో భాగమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన మంగల్ పేట ఆలయం .. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం స్వామివారు వెలసిన ఈ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం.
కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా… చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్ కు దగ్గరలో ఉన్న మంగళ్ పేట్ లో నరసింహ క్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రం లో ఉండే స్వామికి జల నరసింహుడు అనే పేరు.. ఈ ఝరణీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే… ఒక గుహ లో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అలా 600 మీటర్లు లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే గుడి వస్తుంది.
జలనరసింహుడు పేరు ఎలా వచ్చిందంటే..?
శివుడు ఈ కొండ గుహలో తపస్సులో వుండగా జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాల తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నృసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణు మూర్తి హిరణ్యకశిపుని ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తుండగా శివుని వ్రత భంగం చూసి కోపోద్రిక్తుడై జలాసురుడిని నృసింహుడు ఖండించాడు. రాక్షసుడైనా కొద్దిగా చేసిన పుణ్యంతో నరసింహ స్వామి ఏదైనా ఒక మంచి కోరిక కోరుకో తీరుస్తానని అడగగా… జలసురుడు చివరి ఘడియలో నృసింహస్వామిని ఒక కోరిక కోరుకున్నాడు. నువ్వు ఇక్కడ వెలవాలి.. నిన్ను నా పేరుతో కలిసి పిలవాలి అదే వరంగా ఇవ్వమని జలసురుడు కోరాడట. జలసురుడి కోరిక తీర్చడం కోసం ఆ గుహలో వెలసిన నరసింహస్వామి అప్పటి నుంచి జలానరసింహుడి గా కొలవబడుతున్నాడు.
ఎలా వెళ్లాలంటే..?
హైదరాబాద్ నుంచి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడు గంటల ప్రయాణం. ఇక్కడకు చేరుకోవడానికి బస్సు, రైలు సదుపాయం కూడా కలదు.