నేషనల్ అవార్డుల్లో సత్తాచాటిన దక్షిణాది చిత్రాలు..

68 వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంతో పాటు , ఉత్తమ కొరియోగ్రఫి, మేకప్ విభాగం, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులను తెలుగునటులు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. ఈచిత్రంలో సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. సందీప్ రాజ్ దర్శకుడు. కాలబైరవ్ మ్యూజిక్ అందించగా.. సందీప్ రాజ్, ముప్పనేని బెన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. బాక్స్ ఫీస్ వద్ద కలర్ ఫోటో మంచి విజయాన్ని అందుకుంది.

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నాట్యం మూవీ రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రేవంత్ కొరుకొండ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ సంధ్యరాజు నిర్మాతగా వ్యవహరించారు.

అలావెంకుటపురం చిత్రానికి ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. అల్లుఅర్జున్, పూజాహెగ్దే హీరోహీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఉత్తమనటి, నటుడు కేటగీరిలో సూర్య, అపర్ణబాలామురళి సూరారైపోట్రు(తెలుగులో ఆకాశం నీహద్దురా) అవార్డులను దక్కించుకున్నారు. ఈచిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. డెక్కన్ ఎయిర్ విమాన సంస్థ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపినాథ్ జీవిత కథ ఆధారంగా సినిమాను సుధ కొంగర తెరకెక్కించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ (తానాజీ) సైతం నటుడు సూర్యతో కలిసి ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం విశేషం.

ఉత్తమ దర్శకుడిగా దివంగత సచ్చిదానందన్ అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి ఎంపికయ్యాడు.ఈచిత్రంలో నటించినందుకు గాను బిజుమేనన్ ఉత్తమసహాయ నటుడు అవార్డును గెలుచుకున్నారు.