సీజేేఐ గా జస్టిస్ ఎన్వీ రమణ..?

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన  కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. రూల్స్ ప్రకారం ప్రకారం ఈ లేఖను మొదట  ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతారు. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుతుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక కావడం జరుగుతుంది.  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. తర్వాత ఏప్రిల్‌ 24న దేశ 48వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం జరుగుతుంది.

Optimized by Optimole