పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!

గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో   వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది. 

1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే

చిత్తమందు నిలుచు చిన్మయుండు

శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన

చిత్తరువయి చాలా సేవలందు

2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు

విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె

సారవంతమైన చదువు నేర్పు గురువు

యశము శాశ్వతమ్మె యవనిలోన.

3. మార్గదర్శి యౌను మహనీయ గురుమూర్తి

మంచి నాచరించి మహిమజూపు

తనదు జ్ఞానమంత తరగతి గదిలోన

బోధ చేయు త్యాగ బుద్ధితోడ.

4.సృష్టి చేసె బ్రహ్మ సుందర

 మనుజుని

మేధ పదును పెట్టె మేటి గురువు

పరగ విద్య  నేర్వ పండితుడై పోయి

పూజ నీయుడౌను పుడమి యందు.

రచన :

నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి,

సూర్యాపేట

Optimized by Optimole