దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్నటి వరకూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక దేశంలోని పలు నగరాల్లో ఇంధనం ధరలను పరిశీలిస్తే… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 108 రూపాయల 64 పైసలు, అలాగే డీజిల్ 97 రూపాయల 37 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయలకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయల 22 పైసలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… కరీంనగర్‌లో పెట్రోల్ 112 రూపాయల 95 పైసలు, డీజిల్ 106 రూపాయల 17 పైసలైతేజ… నిజామాబాద్‌లో పెట్రోల్ 114 రూపాయల 46 పైసలకు చేరుకుంది. డీజిల్ 107 రూపాయల 58 పైసలుగా ఉంది.
ఇక ఏపీలో ధరల్ని పరిశీలిస్తే, విజయవాడలో పెట్రోల్ 114 రూపాయల 53 పైసలుగా ఉంటే, డీజిల్ ధర 107 రూపాయల 13 పైసలుకు చేరుకుంది. గుంటూరులో పెట్రోల్ 115 రూపాయలు దాటిపోయింది. పెట్రోల్ 115 రూపాయల 35 పైసలుంటే… డీజిల్ 107 రూపాయల 87 పైసలు ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ 113 రూపాయల 02 పైసలైతే, డీజిల్ 106 రూపాయల 24 పైసలు.