తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కొంత ఆందోళనకు గురయ్యారు.
ఇక తాజా పరిస్థితిని పరిశీలిస్తే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టైం దగ్గర పడే కొద్దీ సర్వేల నివేదికల్లో తేడా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి 2 వేల నుంచి 3 వేల ఆధిక్యంతో గెలుస్తారని ‘ మిషన్ చాణక్య ‘ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. అలాగే కొంతమంది నియోజక వర్గంలోని విద్యావంతులు పోలింగ్ సరళి ఆధారంగా రూపొందించిన రిపోర్ట్ ప్రకారం.. బీజేపీ 3 వేల పైచిలుకు ఓట్లతో నెగ్గుతుందని సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. దీంతో కారు పార్టీకి భజన చేసిన సంస్థలు.. ప్రతినిధులు.. కార్యకర్తలు డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. newsminute24 సంస్థ సైతం బీజేపీ అభ్యర్థికె గెలుపు అవకాశాలు ఉన్నట్లు పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం మునుగోడులో దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.
మొత్తం మీద ఇటు బీజేపీ, అటు టీఆర్ ఎస్ అనుకూలంగా సర్వే రిపోర్టులు హల్ చల్ చేస్తుండటం తో.. ఏం జరుగుతుందా అన్న ఆతృత తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.