Telangana: రేగు మల్లేష్ కు సన్మానం…

Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ ను సన్మానించిన స్థానిక యువకులు. రానున్న రోజుల్లో వార్డులోని డ్రింకింగ్ వాటర్,సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తానని వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న అందుబాటులో ఉండి సర్పంచికి తెలియజేసే బాధ్యత తనదని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను ప్రజలకే అందజేస్తానని దైవసాక్షిగా రేగు మల్లేష్ ప్రమాణం చేశారు.అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ రాష్ట్ర నాయకులు రేగు రమేష్, సురపంగా శ్రీకాంత్, జంపాల ప్రవీణ్, జంపాల నితిన్, గంధ మల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Optimized by Optimole