బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు.
ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి రిషి సునాక్. అంతేకాక వందల ఏళ్లు భారత్ ని పాలించిన దేశానికి అధ్యక్ష పదవికి పోటిలో దూసుకుపోతున్న నేత. అయితేనేమి తాను మాత్రం బ్రిటీష్ ఇండియన్ నని సగర్వంగా ప్రకటించాడు .ఇప్పటికే తాను ఆచరణ్మాతక హిందువునని పలుమార్లు వెల్లడించిన అతను.. బ్రిటిష్ ఇండియన్ నని చెప్పుకోవడానికి గర్వపడతానని రిషిక్ మరోమారు స్పష్టం చేశారు.
ఒకవేళ బ్రిటన్ లో జనాభా లెక్కల సేకరణకు వస్తే.. పత్రంలోనూ బ్రిటిష్ ఇండియన్ పౌరుడిగా నమోదు చేసుకుంటానని రిషి సునక్ బాహాటంగా వెల్లడించాడు. అయితే తాను మాత్రం బ్రిటిష్ పౌరుడినని.. సంస్కృతి రీత్యా భారతీయుడినని..హిందువునని ధైర్యంగా పేర్కొన్నారు. అమెరికా రాజకీయ జీవితంలో మతం విస్తరించిందని.. కానీ ఇంగ్లాడ్ లో అలాంటి వాటికి తావులేదని తేల్చిచెప్పాడు. ఈప్రకటనతో రిషిక్ బ్రిటన్ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తొోంది.