ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం..

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఆల్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్య నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు షేక్ అలీముద్దిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదని హితువు పలికారు. జీవితంలో ఏదైనా పోరాడి సాధించుకోవాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దామని  పిలుపునిచ్చారు.

ఇక కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. ఆత్మహత్యల నివారణకు ఆల్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. ఫౌండేషన్ యువతకు ఆదర్శ ప్రాయమన్నారు.ఈ క్రమంలో కళాశాల విద్యార్థినులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న , ఫౌండేషన్ సభ్యులు భాస్కర్,సృజన్, రషీద్, ఇక్బాల్, జాని, అశోక్, ప్రవీణ్, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.