sambashiva Rao:
===========
ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ ఆసక్తిరంగా జరుగుతుంది. మంగళవారం శ్రీలంక- ఆసీస్ మధ్య సూపర్ 12 జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్‌వెల్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్‌లో లంక పేసర్ లాహిరు కుమారా విసిరిన బౌన్సర్ మ్యాక్స్‌వెల్ మెడకు బలంగా తాకింది. దాంతో అతను ఒక్కసారిగా నెలకూలాడు. ఇరుజట్ల ఆటగాళ్లు అతని దగ్గరకు పరుగెత్తారు. ఇక ఫిజియోలు సైతం అతనికి దగ్గరకు చేరుకొని చికిత్స చేశాడు.కొద్దీ క్షణాల వరకు ఏంజరుగుతుందో ఎవరికీ అద్థం కాలేదు. ఫిజియోల చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. తిరిగి తన ఆటను ప్రారంభించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Glenn Maxwell in trouble#ICCT20WorldCup2022 #T20worldcup22 #AUSvsSL pic.twitter.com/4Ae1NVI368
— Cricbazball (@cricbazball) October 25, 2022
శ్రీలంక నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కీలక ఆటగాళ్లు ఔటైయ్యారు. ఈ సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన మ్యాక్స్ వెల్ తనదైన మార్క్ షాట్స్ తో అలరించాడు. ఈ నేపధ్యంలో బౌలర్ లాహిరు కుమారా వేసిన 12వ ఓవర్‌ల మూడో బంతిని షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. దాంతో మ్యాక్స్‌వెల్ ఆఫ్ వికెట్ వైపు జరిగి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. బౌన్సర్ ను అంచనా వేయడంతో మ్యాక్సీ తబడ్డాడు. దాంతో బ్యాట్‌ను మిస్సై..అతని మెడను బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన అతను క్రీజును వదలి పక్కకు వెళ్లి కింద పడిపోయాడు. హూటాహూటిన మైదానంలోకి వచ్చిన ఫిజియోలు అతనికి చికిత్స అందించారు.
గతంలో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటనను గుర్తు చేసింది. ఇదే తరహా రాకాసి బంతికి ప్రాణాలు వదిలాడు. ప్రత్యర్థి పేసర్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అయిన ఫిలిప్ హ్యూస్‌కు బలంగా తగిలింది. ఎడమచెవి కింది భాగంలో(మెడకు) బంతి తాకింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. రెండు రోజులు చికిత్స అనంతరం ప్రాణాలు విడిచాడు. మ్యాక్సీకి సైతం అదే విధంగా తాకడంతో అందరూ కంగారు పడ్డారు.