Sambasiva Rao:
==========
మన దేశంలో ఔషధ మూలికలకు కొదవలేదు. విజ్జానాన్ని అందించిన మహర్షులకు అంతులేదు. ఎంతో మంది ఎన్నోరకాలుగా ఔషదాలు శోధించి గుణగుణాలు తెలియజేశారు. వాటిలో ఒకటి గచ్చకాయ చెట్టు. గచ్చకాయతో ఆయుర్వేదంలొ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గచ్చకాయ మనకు తెలియనిది కాదు. చిన్నప్పుడు దానితో ఆటలాడిన వారు ఉన్నారు. చిన్నతనంలో గచ్చకాయను తీసుకొని బండమీద రాసి చేతికి పేడితే మండుతుంది. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ గచ్చకాయ చెట్టు మన ఊరిలో, మన దేశంలో ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గచ్చకాయలతో అనేక వ్యాధులు నయం అవుతాయి. ఎన్నో ఔషదగుణాలు దానిలో ఉన్నాయి. గచ్చకాయ ఆకు ప్రారంభ దశలో ఉన్న వరిబీజానికి అమోఘంగా పని చేస్తుంది. ఇది ఆకును ఆముదంలో వేయించి వృషణాలకు రాస్తే మూడుపూటల్లో సమస్య తగ్గిపోతుంది. గచ్చకాయతో ఏ ఇతర ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కంటి సమస్యలు:
కళ్ళు, ఎర్రబడటం, కళ్ళచివర వెంట్రుకలు లేకపోవడం వంటి సమస్యలకు గచ్చకాయల గింజలు ఉపయోగపడతాయి. గచ్చకాయ గింజలు, తులసి ఆకు కలిపి నూరి పోయిమీద మరిగించాలి. ద్రవంగా తయారికాగానే దాన్ని కాటుకలా కళ్ళరెప్పల రాస్తే కంట సమస్యలు రావు.
కఫానికి చెక్ :
గచ్చచెట్టు ఆకు కఫాన్ని వాతాన్ని అణచి వేస్తుంది. గచ్చచెట్టు ఆకులు దంచి మీరియాలపొడి వేసుకొని మూడురోజు తాగితే దగ్గు తగ్గుతుంది.
నులిపురుగులు చంపుటకు ..
పొట్లలో నులిపురుగులు చంపుటలో గచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నులిపురుగులు నశించడానికి గచ్చకాయ ఆకులు రసాన్ని మిరియాలపొడితో భోజనం తర్వాత సేవిస్తే నూలిపురుగులు నశిస్తాయి.
మధుమేహం..
మధుమేహం అదుపులో ఉంచడానికి గచ్చచెట్టు పూల రసం సేలించాలి. భోజనానికి ముందు తీసుకోవాలంట. అలా చేస్తే మధుమేహం అదుపులోకి వస్తుందంట.
చర్మవ్యాధులు..
జనాభాలో చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతుంటారు. అయితే వారికి సమస్యకు కూడా గచ్చకాయ ద్వార స్వస్తి పలకవచ్చంట.
కిడ్నీ..
సమస్యలతో బాధపడేవారు కూడా గచ్చకాయ గింజలరసాన్ని తేనేతో కలిపి సేవిస్తే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయంట. ఇంకా జీర్ణశక్తికి, వాతానికి, చర్మానికి ఇలా అనేక సమస్యలకు గచ్చకాయ ద్వారా చెక్ చెప్పొచ్చంట.
గమనికః ఇది పూర్తిగా అధ్యాయనం మాత్రమే. మీకు ఆనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.