 
        
            మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..
హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు…

 
                         
                         
                         
                         
                        