శ్రావణమాసం విశిష్టత..!
హిందువులు పవిత్రంగా భవంతుడిని ఆరాధించే మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది. నెలరోజుల పాటు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తోంది. ఈమాసంలో ఎలాంటి కార్యం తలపెట్టిన శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంటుంది. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో కళకళలాడుతుంది. అంతేకాకుండా వర్షబుుతువు అనుగుణంగా విరివిగా వర్షాలు పడతాయి….