బాహుబలి జలపాతం అందాలను చూశారా..?
కేరళ రాష్ట్రంలోని అతిరాపల్లి జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి సోయగాలు..జలసవ్వడులు.. పైనుంచి జాలువారే జలపాతపు అందాల అనుభూతుల సమ్మేళనమే ఇక్కడి జలపాతం ప్రత్యేకత. దేశంలో నయాగరా జలపాతం అని పిలుచుకునే అతిరాపల్లి జలపాతం ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో అతిరాపల్లి జలపాతం కలదు. వర్షాకాలంలో సందర్శకులకు కనువిందు చేస్తోన్న అతిరాపల్లి జలపాతం. నిత్యం షూటింగ్‌లతో కళకళలాడే ఈజలపాతాన్ని బహుబలి జలపాతంగా పిలుస్తుంటారు….