AP:జెన్-Z వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందన…!!
Andhrapradesh: దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను ప్రజలకు చేరవేస్తున్న జెన్-Z ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆమె చేపడుతున్న సాహస యాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం…
