కొరటాల శివ డైరక్షన్‌లో ఎన్టీఆర్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరక్షన్‌లో మరో చిత్రం రాబోతుంది. వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారెజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. శివ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరక్షన్‌లో నటించాల్సి ఉండగా, అనూహ్యంగా కొరటాల పేరు తెరమీదకొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్రకటన మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది….