యువత దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి: జేడి లక్ష్మీనారాయణ
నల్గొండ:యువత దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…