కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు . ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పర్యటన చేపట్టబోతున్నట్లు…