టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులు అరెస్ట్…

ఏపీ టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషగిరి, పవన్‌, అడపాల గణపతి, షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్‌, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్‌, పేరూరి అజయ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More
Optimized by Optimole