తెలంగాణపై డెంగీ పంజా.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్య శాఖ!
తెలంగాణలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఓవైపు ఎడతెరపిలేని వర్షాలు.. మరో వైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,300 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 600 కేసులు రాగా.. ఒక్క…