టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారీ కేసీఆర్ ఏకగ్రీవం..
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని ఇబ్బందులు పడినా ఓ మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అన్నీరంగాల్లో స్థిరీకరణ సాధించిన తరువాత మనం అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలిచామన్నారు. కాగా దళితబంధు మహా ఉద్యమంగా సాగుతోందని కేసీఆర్ ఆకాంక్షించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని కేసీఆర్ తెలిపారు….