బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…