Praneethanumanthu: ప్రణీత్ హనుమంతు ‘మావాడే’ చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం ఇంత భయపడాలా?
Nancharaiah merugumala senior journalist: ” ప్రణీత్ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా? “ ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా,…