సీమాంధ్ర కథలకు మారుపేరు సింగమనేని!
సీమాంధ్ర కథలు అనగానే గుర్తొచ్చే పేరు సింగమనేని నారాయణ. ఎండిన సేళ్లు, నీళ్లివని బోర్లు, వట్టిపోయిన చెరువులు, సీమ రైతుల కన్నీటి కష్టాల్ని కథల రూపంలో తీసుకొచ్చిన ఘనత వారిదే. నవల రచయితిగా, సాహిత్య విమర్శకుడిగా, ప్రసిద్ధుడైన ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిగురించి క్లుప్తంగా.. సింగమనేని అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా అభ్యుదయ రచయిత, మార్క్సిస్టు చింతనాశీలి. మహాప్రస్థాన గేయాలు, తిలక్ వచనా…