సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..
నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి నుంచి ట్వీట్ల ద్వారా రిక్వెస్టులు పంపడం తప్ప.. ఈ విధంగా నిరసన తెలిపిన వారు లేరు. నాని విజిల్ బౌలర్ పాత్ర పోషించడంతో ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు….