తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు ఆరంభం మాత్రమేనని… త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు టిఆర్ఎస్ పార్టీని వీడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని ఈటెల పేర్కొన్నారు….

Read More
Optimized by Optimole