Ap:రాజమండ్రి వైసీపీలో బేరసారాల బాగోతం? అభ్యర్థుల ఉపసంహరణపై కలకలం
Appolitics: Pavan ✍🏽 రెండు డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల ఏకగ్రీవం.. డబ్బుల వ్యవహారంపై ఆరోపణలు.. సొంత పార్టీ నేతలపైనే వైసీపీ శ్రేణుల అనుమానాలు! రాజమహేంద్రవరం: గోదావరి నగర రాజకీయాల్లో వైసీపీకి అంతర్గత విభేదాలు కొత్త తలనొప్పిగా మారుతున్నాయా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రెండు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం, టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వెనుక రాజకీయ వ్యూహాలు…
