literature: ‘ఇర్లచెంగి’.. భలే భలేటి కథల మనిషి..!
సాయి వంశీ: తెలుగులో ఆడవాళ్లు తమ బాల్య జ్ఞాపకాలు కథలుగా రాయడం అరుదు. నాకు తెలిసి సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు’, పొత్తూరి విజయలక్ష్మి ‘నోస్టాల్జియా’, మన్నం సిందుమాధురి ‘ఉళైనూరు క్యాంపు కతలు’ రాశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జూపాక సుభద్ర తన బాల్య జాపకాలు రాస్తున్నారు. అలాగే కొన్ని కథల్లో ఎండపల్లి భారతక్క తన బాల్యం గురించి రాశారు. (ఇంకెవరైనా రాసి ఉంటే మెన్షన్ చేయండి). చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు…