‘థాంక్యూ’ విలువ తెలిపే చిన్న ప్రయత్నం.. !!
నాగచైతన్య నటించిన తాజాచిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో థ్యాంక్యూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈమూవీ అంచనాలు అందుకుందా లేదా చూద్దాం! కథ : అందరిలాగానే జీవితంలో ఎదగాలన్న కోరిక ఉన్న కుర్రాడు అభిరామ్(నాగచైతన్య).పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదన్న తరహాలో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈక్రమంలోనే ప్రియ(రాశిఖన్నా)…